Shocking: మనుషుల ఎముకలు, పుర్రెలు అమ్ముతున్న వ్యక్తి.. వీడియో వైరల్.. నెటిజన్లు షాక్!

ABN , First Publish Date - 2022-11-29T20:17:10+05:30 IST

కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అనట్టుగానే.. కాదేదీ అమ్మకానికి అనర్హం అంటున్నాడు అమెరికాకు చెందిన 22 ఏళ్ల జాన్‌ ఫెర్రీ అనే యువకుడు. ఇతడి వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే జాన్ ఆన్‌లైన్ ద్వారా మనుషులకు సంబంధించిన ఎముకలు, పుర్రెలను అమ్ముతున్నాడు.

Shocking: మనుషుల ఎముకలు, పుర్రెలు అమ్ముతున్న వ్యక్తి.. వీడియో వైరల్.. నెటిజన్లు షాక్!

కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అనట్టుగానే.. కాదేదీ అమ్మకానికి అనర్హం అంటున్నాడు అమెరికాకు చెందిన 22 ఏళ్ల జాన్‌ ఫెర్రీ (Jon Ferry) అనే యువకుడు. ఇతడి వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే జాన్ ఆన్‌లైన్ ద్వారా మనుషులకు సంబంధించిన ఎముకలు, పుర్రెలను (Human bones, skulls for sale) అమ్ముతున్నాడు. అలాగని అవి నకిలీవి కావు.. పూర్తిగా ఒరిజినల్. న్యూయార్క్‌ (NewYork) నగరంలో ఇతనికి ఓ స్టోర్ కూడా ఉంది. దానిలో మనుషులకు సంబంధించిన రకరకాల ఎముకలు, పుర్రెలు పేర్చి ఉంటాయి. తన ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలను ఫెర్రీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటాడు.

మానవ శరీర భాగాలు ఆన్‌లైన్‌లో అమ్ముతుండటాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అతడి వీడియోలను, సోషల్ మీడియా పోస్ట్‌లను చాలామంది విమర్శిస్తున్నారు. నైతికంగా అతను చేస్తున్నది తప్పు అనిపించ వచ్చేమో కానీ, అమెరికాలో అతడు చేస్తున్న వ్యాపారం చట్ట వ్యతిరేకం కాదు. ఫెర్రీ థాయిలాండ్‌లో పెరుగుతున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులో అతని తండ్రి అతనికి ఒక ఎలుక అస్థిపంజరాన్ని ఇచ్చాడు. చాలా భయంకరంగా, అసహ్యంగా ఉండాల్సిన ఆ బహుమతి అతనికి ఆసక్తిగా అనిపించింది. ఆ తర్వాత అతను జంతువుల అస్థిపంజరాలను సేకరించడం ప్రారంభించాడు. 18 ఏళ్ల వయసులో న్యూయార్క్‌కు వెళ్లిన తర్వాత, ఫెర్రీ జంతు అస్థిపంజరాలను అమ్మే వ్యాపారంలోకి దిగాడు. ఆ తర్వాత ఫెర్రీ Obscura Antiques and Oddities స్టోర్‌ను చూసినపుడు అక్కడ అతడికి మానవ పుర్రెలు కనిపించాయి.

skull.jpg

ఆ తర్వాత తన దుకాణంలో మానవ పుర్రెలు, ఎముకలు విక్రయించడాన్ని కూడా ప్రారంభించాడు. కళాకారులు, కీళ్ల నిపుణులు, విశ్వవిద్యాలయాల మెడికల్ విద్యార్థులు తన కస్టమర్లుగా ఉన్నారని ఫెర్రీ చెబుతున్నాడు. ఎముకలకు సంబంధించిన వస్తువులు అమ్మే ఆస్టియాలజీ కంపెనీలు ఫెర్రీకి సప్లై చేస్తాయి. నిజానికి పుర్రెలు, ఎముకలను గుర్తుతెలియని శవాల నుంచి ఆయా కంపెనీలు సేకరిస్తాయి.. ఆధునిక వైద్య చరిత్రలో చాలా మంది వైద్యులు తమ శిక్షణలో నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించి మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. 19వ శతాబ్దంలో వైద్య పరిశ్రమ వేగంగా విస్తరించడం వల్ల మానవ శరీరాల కోసం డిమాండ్ పెరిగిందట. దీంతో పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారిని హత్యలు చేసి వాటిని మెడికల్ పరిశ్రమకు అమ్ముకునే మాఫియా ఉండేవట. అంతేకాదు ఉరితీసిన ఖైదీలు, క్లెయిమ్ చేయని శవాలు, సమాధుల నుంచి తవ్వి తీసిన శవాలు కూడా మెడికల్ కళాశాలలకు చేరేవట.

శరీరాల కొరతతో బ్రిటీష్ వైద్యులు తమ వలస దేశాలను, ముఖ్యంగా భారతదేశాన్ని ఆశ్రయించేవారట. కోల్‌కతా మానవ ఎముకల వ్యాపారానికి రాజధానిగా ఉండేదట. క్లే ఆడమ్స్, కిల్‌గోర్ ఇంటర్నేషనల్, ఆడమ్, రౌలీ వంటి సంస్థలు భారతదేశం నుంచి ఎముకలను సేకరించి యూరప్, అమెరికా వైద్య విద్యార్థులకు విక్రయించేవి. 1944లో, మాన్‌హట్టన్‌లోని క్లే ఆడమ్స్ ఫ్యాక్టరీలో దొరికిన చాలా అస్థిపంజరాలు భారతదేశం నుంచే వెళ్లాయట. ఇక, 1943 బెంగాల్ కరువు కారణంగా చనిపోయిన కొన్ని లక్షల మంది శవాలు యూరప్, అమెరికా చేరుకున్నాయట. ఈ విషయాలన్నింటినీ స్కాట్ కార్నీ అనే ప్రముఖ జర్నలిస్ట్ తన పుస్తకం ది రెడ్ మార్కెట్‌లో రాశాడు.

Updated Date - 2022-11-29T20:18:52+05:30 IST