ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగింది తెలుసుకుని షాక్.. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా..

ABN , First Publish Date - 2022-11-27T17:44:52+05:30 IST

వైద్యం పేరుతో వ్యాపారం చేసే వైద్యులు కొంతమంది ఉంటే.. అదే వైద్యం పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వైద్యులు ఇంకొందరు ఉంటారు. వీరి వల్ల మొత్తం వైద్యులందరికీ చెడ్డపేరు వస్తుంటుంది....

ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగింది తెలుసుకుని షాక్.. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా..
ప్రతీకాత్మక చిత్రం

వైద్యం పేరుతో వ్యాపారం చేసే వైద్యులు కొంతమంది ఉంటే.. అదే వైద్యం పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వైద్యులు ఇంకొందరు ఉంటారు. వీరి వల్ల మొత్తం వైద్యులందరికీ చెడ్డపేరు వస్తుంటుంది. ఇటలీలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్పత్రిలో స్పృహలోకి వచ్చిన మహిళలు.. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. చివరకు డాక్టర్‌ని ప్రశ్నించగా.. ఏం జరగలేదంటూ బుకాయించాడు. చివరకు పోలీసుల రంగప్రవేశంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదట.. అంతమంది పోలీసులు ఎందుకొచ్చారంటే..

ఇటలీలోని (Italy) నేపుల్స్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల ఎరిక్ ఆండ్రూ అనే వైద్యుడు.. ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్దకు ఇటీవల 51, 73ఏళ్ల వయసున్న మహిళలు (women) చికిత్స కోసం వచ్చారు. దీంతో డాక్టర్ వారిని వేర్వేరుగా (Medical tests) పరీక్షించాడు. తర్వాత చికిత్స చేసే సమయంలో నొప్పిగా ఉంటుందని, అందుకోసం మత్తు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికి వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

క్లాస్ రూంలో టీచర్‌ను వీడియో తీసిన విద్యార్థులు.. దగ్గరికి వెళ్లి.. ఐ లవ్ యూ అని చెప్పి..

ఈ క్రమంలో సదరు వైద్యుడు వారిపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. మెలవకువలోకి వచ్చిన వారికి.. అనుమానం వచ్చింది. దీంతో వైద్యుడిని ప్రశ్నించగా.. ఏం జరగలేదంటూ బుకాయించాడు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల శరీరంపై గాయాలు ఉన్నాయని, అలాగే వారికి సదరు వైద్యుడు మద్యం కూడా తాపించినట్లు తేలింది. దీంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

పెళ్లి విషయం మాట్లాడాలంటూ కొడుకు ప్రియురాలిని పిలిచిన తండ్రి.. నేనున్నా అని హామీ ఇచ్చి.. ఊహించని విధంగా..

Updated Date - 2022-11-27T17:45:23+05:30 IST