బంధువులతో ఆనందంగా ఫొటోలు దిగుతున్న వధూవరులు.. సడన్‌గా తుపాకీ తూటాల మోత.. చివరకు చూస్తే..

ABN , First Publish Date - 2022-12-08T15:47:12+05:30 IST

ఆనందంగా సాగుతున్న ఓ వివాహ కార్యక్రమంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్పటిదాకా సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా..

బంధువులతో ఆనందంగా ఫొటోలు దిగుతున్న వధూవరులు.. సడన్‌గా తుపాకీ తూటాల మోత.. చివరకు చూస్తే..

ఆనందంగా సాగుతున్న ఓ వివాహ కార్యక్రమంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్పటిదాకా సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహ కార్యక్రమంలో వధూవరులు ఆనందంగా ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో సడన్‌గా తుపాకీ తూటల మోత మోగింది. ఏం జరుగుతుందో అర్థం కాక.. జనం పరుగులు పెట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

gun-firing.jpg

ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక.. మరుక్షణం కంటైనర్‌లో.. ఇంటికి వచ్చాక ఆమె చెప్పింది విని..

బీహార్ (Bihar) భోజ్‌పూర్‌లోని నారాయణపూర్ పరిధి మురాద్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం (wedding ceremony) జరిగింది. ఈ సందర్భంగా రాత్రి జయమాల కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కార్యక్రమం సందడి సందడిగా ఉంది. మరోవైపు బంధువులతో వధూవరులు ఆనందంగా ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో గుంపులో ఉన్న ఓ వ్యక్తి అనూహ్యంగా కాల్పులు (firing) జరిపాడు. ఈ ఘటనతో అప్పటిదాకా సందడిగా ఉన్న కార్యక్రమం గందరగోళంగా మారింది.

marriage.jpg

ఓ మహిళ గొంతులోంచి డాక్టర్లు బయటకు తీసిన ఈ వింత పదార్థమేంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ఏం జరుగుతుందో అర్థం కాక జనం అటూ, ఇటూ పరుగులు తీశారు. కాల్పుల ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ (Viral photos and videos) అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..

Updated Date - 2022-12-08T15:47:17+05:30 IST