తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..

ABN , First Publish Date - 2022-10-24T20:45:18+05:30 IST

కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కన్నబిడ్డలు అని కూడా చూడకుండా.. వక్రదృష్టితో చూస్తుంటారు. తమ కామవాంఛను తీర్చుకోవడానికి కన్నపిల్లలను బలి చేస్తుంటారు. సభ్యసమాజం తల దించుకునే.. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట..

తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..
ప్రతీకాత్మక చిత్రం

కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కన్నబిడ్డలు అని కూడా చూడకుండా.. వక్రదృష్టితో చూస్తుంటారు. తమ కామవాంఛను తీర్చుకోవడానికి కన్నపిల్లలను బలి చేస్తుంటారు. సభ్యసమాజం తల దించుకునే.. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఛత్తీస్‌గడ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు చూడటానికి తరచూ వచ్చే తండ్రి.. చివరకు ఓ రోజు ఎవరికీ చెప్పొందంటూ భార్యకు అసలు విషయం చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గడ్‌లోని (Chhattisgarh) బిలాస్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళకు రాయ్‪‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తితో 2014లో వివాహమైంది. అతను ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఉండేవాడు. ఇదిలావుండగా, వీరికి కూతురు పుట్టినప్పటి నుంచి సమస్యలు తలెత్తాయి. రోజూ ఏదో ఒక సాకు చూపుతూ భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా ఆమె ఓపిగ్గా భరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల వేధింపులు ఎక్కువవడంతో చివరకు తెగించి నిర్ణయం తీసుకుంది. మూడు నెలల క్రితం తన కుమార్తెను తీసుకుని బిలాస్‌పూర్‌లోని పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో జూలై నుంచి భర్త అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి కుమార్తెను చూసి వస్తూ ఉండేవాడు. ఓ రోజు కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కూతురు తన తల్లికి తెలియజేసింది. తర్వాత భార్య వద్దకు వెళ్లిన భర్త.. జరిగిన విషయం తెలియజేసి, ఎవరికీ చెప్పొందంటూ ప్రాథేయపడ్డాడు. అప్పటికే భర్తపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కూతురు అని కూడా చూడకుండా.. నీచానికి పాల్పడ్డ ఇలాంటి తండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-10-24T20:45:23+05:30 IST