దోపిడీ దొంగల వెరైటీ రూటు.. సెంటిమెంట్ డైలాగ్స్‌తో బ్యాంకు ఉద్యోగులను కదలకుండా చేసి మరీ..!
ABN , First Publish Date - 2022-11-18T17:35:29+05:30 IST
కొందరు సెంటిమెంట్ పేరుతో దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తుంటారు. ప్రేమ విషయంలో యువతులను బెదిరించేవారు కొందరైతే.. మరికొందరు అదే సెంటిమెంట్‌ను క్యాష్ రూపంలోకి మార్చుకుంటుంటారు. రాజస్థాన్‍లో..
కొందరు సెంటిమెంట్ పేరుతో దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తుంటారు. ప్రేమ విషయంలో యువతులను బెదిరించేవారు కొందరైతే.. మరికొందరు అదే సెంటిమెంట్‌ను క్యాష్ రూపంలోకి మార్చుకుంటుంటారు. రాజస్థాన్‍లో కొందరు దోపిడీ దొంగలు సెంటిమెంట్ డైలాగ్స్‌తో బెదిరింపులకు దిగారు. బ్యాంకు కదలకుండా చేసి.. తమ పని కానిచ్చేశారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!
రాజస్థాన్‌లోని (Rajasthan) పాలి ఎస్‌బీఐ బ్యాంకులో (SBI Bank) ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం బ్యాంకు తెరవగానే సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ముఖానికి మాస్కులు వేసుకుని లోపలికి వచ్చారు. అంతా చూస్తుండగానే క్యాష్ కౌంటర్ (Cash counter) వద్దకు వెళ్లారు. ఇద్దరిలో ఓ వ్యక్తి జేబు నుంచి తుపాకీ (gun) బయటికి తీశాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తల మీద తుపాకీ గురి పెట్టి.. ‘‘ నీ భార్య, పిల్లలపై ప్రేమ ఉంటే, వారితో కలిసి బతకాలి అని అనుకుంటే.. కదలకుండా కూర్చో.. కాదు కూడదని అతి తెలివి ప్రదర్శిస్తే కాల్చి పడేస్తా’’.. అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు.
నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..
దీంతో క్యాషియర్, సిబ్బందితో పాటూ ఖాతాదారులు మొత్తం కిక్కురుమనకుండా కూర్చున్నారు. ఈలోగా మరో దుండగుడు క్యాష్ కౌంటర్ వద్దకి వెళ్లి, అందులోని రూ.3.33లక్షలను తీసుకుని బ్యాగులో వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి తాపీగా బయటికి వెళ్లి, బైకుపై పారిపోయారు. వారు బయటికి వెళ్తున్న సమయంలో బ్యాంకులోని సిబ్బంది కొందరు కోపంతో పరుగెత్తుకుంటూ బయటికి వచ్చి, దుండగులపై రాళ్లు రువ్వారు. కానీ అప్పటికే వారు బైకుపై ఉడాయించారు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, సీసీ కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.