Viral Video: రైలు బోగీ దగ్గర ఈ పోలీస్ తిప్పలు చూడండి.. పాపం అటూ ఇటూ తిరుగుతూ..
ABN , First Publish Date - 2022-11-05T19:36:26+05:30 IST
రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పండుగ సమయాల్లో అయితే.. అడుగు తీసి అడుగు పెట్టలేని విధంగా రద్దీ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ప్రయాణికులు..
రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పండుగ సమయాల్లో అయితే.. అడుగు తీసి అడుగు పెట్టలేని విధంగా రద్దీ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ప్రయాణికులు.. ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. నిబంధనలు అమలుపరిచే క్రమంలో రైల్వే పోలీసులు ఒక్కోసారి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంటుంది. అయినా అప్పుడప్పుడూ పరిస్థితి చేయిదాటి పోతుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బోగీ తలుపు వద్ద గుంపులు గుంపులుగా ఉన్న ప్రయాణికులను.. కిందకు దించేందుకు ఓ పోలీసు పడిన శ్రమను చూసి నెటిజన్లు అయ్యో పాపం!.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..
ముంబై లోకల్ ట్రైన్‌కు (Mumbai Local Trains) సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఏసీ లోకల్ ట్రైన్.. ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. కనీసం డోర్లు వేయలేని స్థితిలో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. తలుపు వద్ద గుంపులు గుంపులుగా జనం ఉండడంతో డోర్లు మూసుకుపోవడానికి వీలు లేకుండా ఉంటుంది. పరిస్థితిని గమనించిన ఓ కానిస్టేబుల్ (Railway Police).. ముందుగా ఓ బోగీ వద్దకు వెళ్లి కొందరిని బలవంతంగా కిందకు దింపుతాడు. అంతలో మరో బోగీ తలుపు వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది.
ఒకప్పుడు సింగపూర్‌లో ప్రొఫెషనల్ చెఫ్.. ఇప్పుడు స్వదేశ వీధుల్లో చిన్న ఫుడ్ స్టాల్ ఓనర్.. అయితేనేం..
దీంతో అన్ని బోగీల వద్దకు పరుగులు పెడుతూ ప్రయాణికులను దింపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక బోగీ వద్దకు వెళ్లే లోపు.. మరో బోగీ వద్ద పరిస్థితి చేయిదాటి పోతుంటుంది. అటూ ఇటూ పరుగులు పెడుతున్న పోలీసును చూసి.. ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు అయ్యో పాపం! ఎంత కష్టం వచ్చింది.. అంటూ చర్చించుకుంటూ ఉంటారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రతి బోగీకి ఓ పోలీసును అందుబాటులో ఉంచితే.. ఇలాంటి ఇబ్బందులు ఉండని సూచనలు ఇస్తున్నారు.
Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..