Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..
ABN , First Publish Date - 2022-12-27T21:25:18+05:30 IST
కుటుంబ పోషణ నిమిత్తం ఓ యువతి.. ఓ ఒంట్లో పనికి కుదిరింది. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు యజమానురాలు షాక్ ఇచ్చింది. రోజూ చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టింది. ఇటీవల అక్కడి నుంచి ..
కుటుంబ పోషణ నిమిత్తం ఓ యువతి.. ఓ ఒంట్లో పనికి కుదిరింది. అయితే అక్కడికి వెళ్లిన ఆమెకు యజమానురాలు షాక్ ఇచ్చింది. రోజూ చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టింది. ఇటీవల అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేందుకు ప్రయత్నించింది. లిప్ట్‌లో ఉన్న యువతిని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బౌద్ధ నగర్‌కు చెందిన షెఫాలీ కౌల్ అనే మహిళ (woman).. అనిత ఓ యువతి ఒక రోజంతా తన ఇంట్లో పని చేసేందుకు మాట్లాడుకుంది. అయితే ఆమె ఇంటికి వెళ్లగానే యజమాని అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఎక్కవుగా పని చేయించడమే కాకుండా యువతిని చిత్రహింసలకు (Torture) గురి చేసింది. గదిలో బంధించి మరీ దాడి (attack) చేసింది. ఇటీవల ఓ రోజు యువతి అక్కడి నుంచి తప్పించుకుని రావడానికి ప్రయత్నించింది. లిఫ్ట్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. షెఫాలీ కౌల్ గమనించి అక్కడికి వెళ్లింది. యువతిని బలవంతంగా బయటికి లాగేందుకు ప్రయత్నించింది.
Whatsapp Alert: డిసెంబర్ 31 తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..!
వద్దు వద్దు అని యువతి వేడుకుంటున్నా వినకుండా ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో (CCTV footage) రికార్డు అయ్యాయి. దీంతో పోలీసుల సదరు మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, మహిళ ఉంటున్న సొసైటీ సంబంధించిన ఇళ్ల యజమానులు.. గతంలోనూ ఇలాగే డ్రైవర్లు, డెలీవరీ బాయ్ తదితరులపై దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిసింది. యువతిపై దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పురనావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.