viral video: పీకలదాకా తాగి.. అందరూ చూస్తుండగా.. ఈ నలుగురు మహిళలు చేసిన పనికి నెటిజన్లు షాక్..
ABN , First Publish Date - 2022-11-08T11:03:35+05:30 IST
నలుగురు మహిళల చేతుల్లో ఆ ఒక్క మహిళ చెప్పలేనంత చావుదెబ్బలు తినింది.
పబ్ బయట రోడ్డు మొత్తం సందడి సందడిగా ఉంది. అప్పుడే అక్కడ గందరగోళం ఏర్పడింది. ఉన్నట్టుండి నలుగురు మహిళలు ఒక మహిళను చుట్టుముట్టారు. ఫ్యాంట్ షర్ట్ లు వేసుకున్న ఆ నలుగురు మహిళలు తమ నడుముకు కట్టుకున్న బెల్ట్ లు, తమ దగ్గరున్న కర్రలు బయటకు తీసి వాటితో ఆ మహిళను చావబాదడం మొదలుపెట్టారు. అంతేనా వారి శక్తి కొద్ది ఆ మహిళ మీద పిడిగుద్దులు కురిపించారు. పాపం ఆ మహిళ ఏం తప్పు చేసిందో, ఆమెను చుట్టుముట్టిన వారికి ఆమె వల్ల ఏం ఇబ్బంది ఎదురయ్యిందో తెలియదు గానీ నలుగురు మహిళల చేతుల్లో ఆ ఒక్క మహిళ చెప్పలేనంత చావుదెబ్బలు తినింది. చుట్టూ ఎంతోమంది గుమిగూడారు. నలుగురు కలసి ఒక మహిళను కొడుతూ ఉంటే చోద్యం చూస్తూ నిలబడ్డారు. అయ్యో ఎందుకు ఇలా కొడుతున్నారు, ఆడవారు సాటి ఆడదాన్ని ఇలా కొట్టవచ్చా ఆమెను కొట్టడం ఆపండి అని చెప్పిన వారు ఒక్కరూ లేరక్కడ. మరికొందరు వీడియోలు తీస్తూ ఉండిపోయారు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో చోటుచేసుకుంది. పబ్ బయట పీకలదాకా తాగిన నలుగురు మహిళలు మరొక మహిళను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు సదరు మహిళల మీద కేసు నమోదు చేశారు. ఆ నలుగురు మహిళలు తాగిన మైకంలో రెచ్చిపోయి అలా చేశారా లేదా వారు అలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ మహిళల నిర్వాకం మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.