Black water: ఈ నీరు తాగితే నిజంగా అంత బలమొస్తుందా.. సెలబ్రిటీలు తాగే ఈ బ్లాక్ వాటర్ ప్రత్యేకతలు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-01T16:28:07+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బ్లాక్‌వాటర్ గురిచే చర్చ నడుస్తోంది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటీనటులు మలైకా అరోరా, కరణ్ జోహార్ తదితర సెలబ్రిటీలు ఈ నీటిని తాగుతుండడంతో.. అసలు ఏంటీ బ్లాక్ వాటర్ అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ నీటిని తీసుకుంటే నిజంగా అంత బలం వస్తుందా... ఎందుకు ప్రముఖ సెలబ్రిటీలంతా ఈ నీటిని తీసుకుంటున్నారు.. అని చాలా మందిలో సందేహం ఉంది. అసలు..

Black water: ఈ నీరు తాగితే నిజంగా అంత బలమొస్తుందా.. సెలబ్రిటీలు తాగే ఈ బ్లాక్ వాటర్ ప్రత్యేకతలు ఏంటంటే..

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బ్లాక్‌వాటర్ గురించే చర్చ నడుస్తోంది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటీనటులు మలైకా అరోరా, కరణ్ జోహార్ తదితర సెలబ్రిటీలు ఈ నీటిని తాగుతుండడంతో.. అసలు ఏంటీ బ్లాక్ వాటర్ అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ నీటిని తీసుకుంటే నిజంగా అంత బలం వస్తుందా... ఎందుకు ప్రముఖ సెలబ్రిటీలంతా ఈ నీటిని తీసుకుంటున్నారు.. అని చాలా మందిలో సందేహం ఉంది. అసలు ఈ బ్లాక్ వాటర్‌ని ఎలా తయారు చేస్తారు.. ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే దుష్ప్రభావాలు ఏంటి తదితర వివరాల గురించి తెలుసుకుందాం..

virat-kohli.jpg

Viral Video: కళ్యాణ మంటపంపై వధువు ఎదుట ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం.. ఓపికతో భరించిన వరుడు.. చివరకు..

మనం రోజూ తాగే సాధారణ నీటికి కొన్ని రకాల మినరల్స్ కలిపి ఈ బ్లాక్ వాటర్‌ను (Black water) తయారు చేస్తారు. ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, హీరోయిన్లు ఊర్వశి రౌటాలా, మలైకా అరోరా, శ్రుతి హాసన్ (Urvashi Rautala, Malaika Arora, Shruti Haasan) తదితరులు ఈ నీటినే తీసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌గా ఉండేందుకే బ్లాక్ వాటర్ తీసుకుంటున్నానని విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఆల్కలీన్ వాటర్‌ తీసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చాలా మంది అజీర్తి, గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. ఈ నీటిని తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. మరోవైపు ఆల్కలైన్ ఎలక్ట్రోలైజ్డ్ వాటర్ తీసుకోవడంతో జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని, మలబద్ధక సమస్య కూడా తగ్గుతుందని పలువురు నిపుణులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

block-water.jpg

Viral Video: లేటు వయసులోనూ ఈ బామ్మ వేసిన లేటెస్ట్ స్టెప్పులకు.. నెటిజన్లు ఫిదా..

సాధారణంగా మనం తాగే మంచి నీటికి పీహెచ్ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ పీహెచ్ స్థాయి ఏడుకుపైనే ఉంటుందట. సాధారణ నీటితో పోల్చినప్పుడు ఇందులో క్షార స్థాయి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులోని మినరల్స్ శరీరానికి ఎలా చేరుతున్నాయి.. అనే దానిపై ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఆర్‌వో వాటర్‌లో పీహెచ్ స్థాయి తక్కువగా ఉంటుంది. పైగా ఆమ్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇందువల్ల శరీరం దీన్ని ప్రాసెస్ చేయడంలో ఒక్కోసారి ఇబ్బంది ఎదురవుతుంటుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కొన్నిసార్లు విటమిన్లు, సప్లిమెంట్లను విడిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఈ బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గట్టిగా అరవద్దంటూ విద్యార్థినికి రూ.10లు ఇచ్చిన టీచర్.. బాలిక ఇంటికి వెళ్లిన రెండు రోజుల తర్వాత..

బ్లాక్ వాటర్‌ తాగడం వల్ల లాభాలతో పాటూ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయట. ఈ నీటిని మరీ ఎక్కువగా తాగడం వల్ల వికారం, వాంతులు, శరీర ద్రవాల పీహెచ్ స్థాయిల్లో మార్పులు వచ్చే ప్రమాదం ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మినరల్స్ ఎక్కువగా ఆరోగ్యానికి మంచివే అయినా ఎక్కువగా తీసుకోవడం వల్ల విషంగా మారే ప్రమాదం ఉంటుందట. అదేవిధంగా తక్కువ ఉన్నా వివిధ జబ్బులు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. సెలబ్రిటీలు.. నిపుణులు, డైటీషియన్ల సూచనల మేరకే ఈ నీటిని తీసుకుంటుంటారని చెబుతున్నారు.

వద్దంటున్నా.. అనవసరంగా వారితో పెట్టుకున్నాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..

ఇక ఈ నీటి ధర విషయానికొస్తే.. భారత్‌లో ఎక్కువగా కనిపించే బ్లాక్ వాటర్ బ్రాండ్లలో ఇవోకస్ ఒకటి. మలైకా అరోరా చేతిలో కనిపించిన బ్యాటిల్ ఈ బ్రాండ్‌దే. 500 మిల్లీ లీటర్ల ఆరు బాటిళ్లను ప్రస్తుతం సంస్థ రూ.600కు విక్రయిస్తోంది. ఒక బాటిల్‌లో 32 మి.గ్రా. కాల్షియం, 21 మి.గ్రా. మెగ్నిషియం, 8 మి.గ్రా. సోడియం ఉంటాయని గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ వెల్లడించింది. అలాగే వైద్య రిషి మరో బ్లాక్‌వాటర్ బ్రాండ్ కూడా ఆన్‌లైన్ మంచి నీళ్లను అమ్ముతోంది. ఈ సంస్థ కూడా ఆరు 500 మిల్లీ లీటర్ల బాటిళ్లను రూ.594కు విక్రయిస్తోంది. కొన్ని కంపెనీలు లీటర్ నీటిని వేల రూపాయల్లో కూడా విక్రయిస్తుంటాయి.

వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..g

Updated Date - 2022-11-01T16:52:22+05:30 IST