Viral Video: కళ్యాణ మంటపంపై వధువు ఎదుట ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం.. ఓపికతో భరించిన వరుడు.. చివరకు..
ABN , First Publish Date - 2022-10-30T19:42:44+05:30 IST
కళ్యాణం.. అంటేనే కలకాలం గుర్తుపెట్టుకునే మధుర ఘట్టం. ఎన్నేళ్లయినా... దంపతులకు మాత్రం వివాహ ఘడియలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే చాలా మంది వివాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమం పదికాలల పాటు పదిలంగా నిలిచేందుకు.. ఖర్చుకు వెనుకాడకుండా ఫొటో, వీడియోగ్రాఫర్లను పిలిపిస్తుంటారు. ఇటీవల..
కళ్యాణం.. అంటేనే కలకాలం గుర్తుపెట్టుకునే మధుర ఘట్టం. ఎన్నేళ్లయినా... దంపతులకు మాత్రం వివాహ ఘడియలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే చాలా మంది వివాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమం పదికాలల పాటు పదిలంగా నిలిచేందుకు.. ఖర్చుకు వెనుకాడకుండా ఫొటో, వీడియోగ్రాఫర్లను పిలిపిస్తుంటారు. ఇటీవల వివాహ కార్యక్రమాలను కూడా సినిమా తరహాలో షూట్ చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. ఫొటోగ్రాఫర్ కారణంగా ఓ వివాహ వేడకలో సరదా ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ మంటపంపై వధువుకు ఫొటో తీసే క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ అత్యత్సాహం ప్రదర్శిస్తాడు. అప్పటిదాకా ఓపికతో భరించిన వరుడు చివరకు ఏం చేశాడంటే..
Viral Video: లేటు వయసులోనూ ఈ బామ్మ వేసిన లేటెస్ట్ స్టెప్పులకు.. నెటిజన్లు ఫిదా..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాహ వీడియో (Instagram viral videos) వైరల్ అవుతోంది. కళ్యాణ మండపంపై వధూవరులు (bride and groom) నిలబడి ఉండగా.. కెమెరామెన్ ఫొటోలు (Photos and videos) తీస్తుంటాడు. ఇంతవరకూ ఏ సమస్యా లేదు గానీ.. వధువుకు ఫొటో తీసే క్రమంలోనే అసలు సమస్య వచ్చి పడింది. వరుడుని పట్టించుకోకుండా.. ముందుగా వధువుకు ఫొటో తీస్తుంటాడు. అయితే వివిధ కోణాల్లో ఫొటో తీయాలనే ఉద్దేశంతో ఆమెకు సూచనలిస్తూ, మధ్య మధ్యలో ఆమెను తాకుతూ ఉంటాడు. పక్కనే ఉన్న వరుడు అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఫొటోగ్రాఫర్ వధువును తాకగానే వరుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ముందూ వెనుకా ఆలోచించకుండా వధువు ముందే.. ఫొటోగ్రాఫర్‌ను గట్టిగా కొడతాడు. ఏంటి నువ్వు చేసే పని.. అంటూ తిట్లపురాణం అందుకుంటాడు. దీంతో వధువు ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: వీడేంట్రా.. ఏకంగా సింహానికే పాలు పడుతున్నాడు.. చూస్తే ఖచ్చితంగా షాకవుతారు..