Ram Charan: ట్రిపుల్ ఆర్ తరహా కథల కోసం వరల్డ్ మూవీ లవర్స్ వేచి చూస్తున్నారు: రామ్ చరణ్
ABN , First Publish Date - 2022-12-05T17:39:10+05:30 IST
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు వరించింది. ఈ అవార్డు వేడుకకు హాజరైన వారితో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముచ్చటించారు.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు వరించింది. ఈ అవార్డు వేడుకకు హాజరైన వారితో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముచ్చటించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బ్రెయిన్ చైల్డ్ అని అన్నారు. (Ram Charan awarded as Future of Young India) చరణ్ మాట్లాడుతూ ``ఈ అవార్డును మా నాన్నకు అంకితం చేస్తున్నా. 2007లో నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు మా నాన్న నాతో చెప్పిన మాటలు గుర్తున్నాయి. దర్శకులను, నిర్మాతలను గౌరవించాలి. అయితే వారికన్నా ముందు మన కోసం పనిచేసేవారి బాగోగులు చూసుకోవాలని సూచించారు. ఆ మాటలను శ్రీరామరక్షగా భావిస్తున్నాను. ఎప్పటికీ ఆచరిస్తాను`` అని అన్నారు. (Ram Charan dedicated his award to his father and Mega Star Chiranjeevi)
1999లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్. ``సాంకేతికంగా ఇంత పురోభివృద్ధి చెందినా, వైద్యపరంగా మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉన్నా, దగ్గరి వ్యక్తి ఒకరు సరైన సమయంలో రక్తం అందక కన్నుమూయడం చిరంజీవిగారిని కలచివేసింది. ఆ వేదన నుంచి పుట్టిందే చిరంజీవి బ్లడ్‌బ్యాంక్. తన అభిమానగణాన్ని రక్తదానం దిశగా ప్రోత్సహించారు మెగాస్టార్. రక్తదానం చేసిన వారికి తనతో ఫొటో దిగే అవకాశాన్ని కల్పిస్తూ మరింత మందిలో ఉత్సాహం నింపారు`` అని అన్నారు. దాదాపు 75వేల మంది సినీ కార్మికులకు కోవిడ్ ప్యాండమిక్ సమయంలో చిరంజీవి, రామ్‌చరణ్ అందించిన సాయాలను గుర్తుచేసుకున్నారు నిర్వాహకులు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లనే ఇంతా సాధ్యమైందని అన్నారు చరణ్. (Blood Bank is Chiranjeevi's brainchild, says Ram Charan)
తండ్రితో తనకున్న అనుబంధాన్ని వేదిక మీద మరోసారి గుర్తుచేసుకున్నారు రామ్‌చరణ్. ఎస్.ఎస్.రాజమౌళి మగధీర స్క్రిప్ట్ చెప్పడానికి తమ ఇంటికి వచ్చినప్పుడు చిరంజీవి ఆ కథను విన్న తీరు గురించి సరదాగా సభికులతో పంచుకున్నారు. పదిహేనేళ్లుగా పరిశ్రమలో ఉన్న చరణ్ ఇప్పుడు 15వ సినిమాను చేస్తున్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. అన్నీ వాదాలను పక్కనపెట్టి, పిల్లలందరూ తమ తల్లిదండ్రులకు రుణపడి ఉండాలని చెప్పారు.
చిరంజీవి తండ్రి నెల్లూరులో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనతో నేవీ ఆఫీసర్ అవుతానని చెప్పి, చెన్నైలో యాక్టింగ్ స్కూల్‌కి అటెండ్ అయ్యారు చిరు. తండ్రితో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయానని ఇప్పటికీ చిరంజీవి బాధపడుతుంటారని అన్నారు చరణ్. ఎన్ని పనులున్నా, ఎలాగోలా సమయాన్ని కేటాయించుకుని తల్లిదండ్రులతో గడపాలని అన్నారు చరణ్. టైట్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి కుటుంబం కోసం, తన స్టాఫ్ కోసం, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం సమయాన్ని కేటాయించే తీరు చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పారు చరణ్.
ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుతూ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మనస్ఫూర్తిగా పనిచేసిన ప్రతి ఒక్కరూ అని అన్నారు రామ్‌చరణ్. దంగల్, తారే జమీన్ పర్, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు మన ఒరిజినల్ అటెంప్ట్ అని, హాలీవుడ్ సినిమాలకు కాపీ కాదని చెప్పారు. భారతదేశంలో పుట్టిన ట్రిపుల్ ఆర్ తరహా కథల కోసం వరల్డ్ మూవీ లవర్స్ వేచి చూస్తున్నారని చెప్పారు రామ్‌చరణ్. (Ram Charan says, films like Dangal, Tare Jameen Par, RRR are our original stories and not copied from Hollywood. World Film Lovers are waiting to see RRR kind of stories, he added)