Viral Video: కారు బానెట్‌పై కూర్చుని మరీ యువతి విన్యాసాలు.. పోలీసుల కంట పడటంతో..
ABN , First Publish Date - 2022-11-09T16:52:53+05:30 IST
రీల్స్.. రీల్స్.. రీల్స్... ప్రస్తుతం ఇది ప్యాషన్‌గా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రీల్స్ (Facebook, Instagram reels) చేయడం సర్వసాధారణంగా మారింది. వీడియోలు వైరల్ అయితే సంతోషపడడం, కాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. కొందరైతే వైరల్ కాలేదనే..
రీల్స్.. రీల్స్.. రీల్స్... ప్రస్తుతం ఇది ప్యాషన్‌గా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రీల్స్ (Facebook, Instagram reels) చేయడం సర్వసాధారణంగా మారింది. వీడియోలు వైరల్ అయితే సంతోషపడడం, కాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. కొందరైతే వైరల్ కాలేదనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడడం కూడా చూస్తూనే ఉన్నాం. వీడియోలు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరైతే బహిరంగ ప్రదేశాల్లో నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువతి (young woman) కారు బానెట్‌పై కూర్చుని మరీ యువతి విన్యాసాలు చేయడం వైరల్‌గా మారింది. చివరకు పోలీసుల కంట పడడటంతో..
తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..
ఉత్తరప్రదేశ్ నోయిడాలో (Uttar Pradesh Noida) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి నల్లటి స్కార్పియో వాహనం (Scorpio vehicle) బానెట్‌పై కూర్చుని వెళ్తుంటుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఆమె ఇలా చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. స్థానికులు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్‌గా (Viral videos) మారడంతో పోలీసులు.. కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా చోటు చేసుకున్నాయి. దీపావళి సందర్భంగా కొందరు యువకులు కారుపై కూర్చుని, బాణసంచా కాల్చడం వైరల్‌గా మారింది. అప్పట్లో పోలీసులు ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. నోయిడా పరిధిలో నాలుగు, ఐదు నెలల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. రీల్స్ వైరల్ అవ్వడం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్లు కూడా సలహాలు, సూచనలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ..