Rohit Sharma: రెండో టెస్టుకీ దూరమైన రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2022-12-19T18:12:24+05:30 IST

బొటనవేలి గాయంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమైన టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ

Rohit Sharma: రెండో టెస్టుకీ దూరమైన రోహిత్ శర్మ
Rohit Sharma

ఢాకా: బొటనవేలి గాయంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమైన టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.

రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. రెండో టెస్టులోనూ జట్టును నడిపించనున్నాడు. చటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఆటతీరు కనబర్చిన భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.

భారత జట్టును చాలాకాలంగా గాయాల బెడద వేధిస్తోంది. రోహిత్ శర్మతోపాటు జస్ప్రీత్ బుమ్రా (వెన్నెముక గాయం), మహమ్మద్ షమీ (భుజం గాయం), రవీంద్ర జడేజా (మోకాలి గాయం) ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు.

Updated Date - 2022-12-19T18:57:16+05:30 IST