ACB Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌

ABN , First Publish Date - 2022-10-29T22:11:15+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్‌ విధించింది. హైకోర్టు (High Court) ఆదేశాలతో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ACB Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్‌ విధించింది. హైకోర్టు (High Court) ఆదేశాలతో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిలను న్యాయమూర్తి ముందు హాజరుపరచినట్లు పోలీసులు (police) తెలిపారు. ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 29 నుంచి నవంబర్ 11 వరకు రిమాండ్‌ విధించినట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రిమాండ్‌ విధించవద్దని నిందితుల తరపు లాయర్‌ కోరారు. తన క్లయింట్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకొని రిమాండ్ విధించొద్దని లాయర్‌ వాదించారు. లాయర్‌ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2022-10-29T22:11:19+05:30 IST