Basara.. అనేక సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా: లేఖలో భానుప్రసాద్
ABN , First Publish Date - 2022-12-19T10:45:26+05:30 IST
నిర్మల్ జిల్లా: బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపింది.
నిర్మల్ జిల్లా: బాసర (Basara) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ (Suicide note) లభ్యమైంది. మానసిక సమస్యల వ
ల్లే చనిపోతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఓసీడీ వల్ల సరిగ్గా చదవలేక పోతున్నానని.. మార్కులు తక్కువగా వస్తుండడంతో.. అనేక సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని.. జీవితంపై విరక్తితోనే చనిపోతున్నానని.. అమ్మా క్షమించు.. అంటూ విద్యార్థి భానుప్రసాద్ లేఖలో పేర్కొన్నాడు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మూడు, నాలుగు రోజుల క్రితమే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మంచల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్(18) ఆర్జీయూకేటీలో పీయూసీ-2 చదువుతున్నాడు. కాలేజీ క్యాంప్‌సలో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గది నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీ అధికారులకు సమాచారమందించారు. అధికారులు వచ్చి చూడడంతో భానుప్రసాద్ ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా అతడు మూడు, నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి భానుప్రసాద్ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆదివారం మధ్యాహ్నమే తెలిసినా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.