TRS MLAs poaching case: తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

ABN , First Publish Date - 2022-10-28T16:28:59+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పాత్ర ఉందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

TRS MLAs poaching case: తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం
Bandi Sanjay

యాదిగిరిగుట్ట: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) పాత్ర ఉందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేదని సంజయ్ వాధిస్తున్నారు. మాటలతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూ... తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిజాయితీ నిరూపించుకోవడానికి.. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad Farmhouse)లో జరిగిన బేరసారాల ఆడియోలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర (Ramachandra Bharti alias Satish Chandra), నందకుమార్ (Nandakumar) మధ్య జరిగిన సంభాషణలు అంటూ చెబుతున్న ఆ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో రాజకీయ జీవితం, బేరసారాల గురించి సంభాషించుకున్నారు.

మరోవైపు నిందితుల రిమాండ్‌కు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తిరస్కరించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. నేర శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) 41ఏ సెక్షన్‌ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించవచ్చని సూచించారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్‌లో బుధవారం రాత్రి రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి స్వామీజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-28T17:54:38+05:30 IST