Bharath jodo yatra: రాహుల్ పాదయాత్రలో కలకలం
ABN , First Publish Date - 2022-10-31T20:23:11+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul gandhi) పాదయాత్రలో భద్రతా వైఫల్యం కారణంగా కలకలం రేగింది. పాదయాత్రలో పాల్గొన్న ఓవ్యక్తి భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు.
శంషాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul gandhi) పాదయాత్రలో భద్రతా వైఫల్యం కారణంగా కలకలం రేగింది. పాదయాత్రలో పాల్గొన్న ఓవ్యక్తి భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు. శంషాబాద్ (Shamshabad) మండలం పాల్మాకుల వద్ద రాహుల్‌పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ కార్యకర్త వాయువేగంతో దూసుకువచ్చాడు. అలా వచ్చిన అతను రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకుని వదలలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీపీఎఫ్ (CRPF) బలగాలు బలవంతంగా ఆతన్ని బయటకు తీసుకువెళ్లారు. అనంతరం విచారించి రాహుల్ అభిమానిగా గుర్తించి పోలీసులు వదిలేశారు. రాహుల్‌తో ఫొటో దిగేందుకు ఇతనితో పాటు మరొక అభిమాని కూడా ప్రయత్నించాడని తరువాత పోలీసులు వెల్లడించారు. . ఇదిలా ఉంటే భద్రతా వలయాన్ని చేధించుకుని లోనికి రావడంతో రాహుల్ గాంధీ తన భద్రతా సిబ్బందిపై అసహనాన్ని, విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన తరువాత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగించారు. యథావిధిగా రోడ్డు వెంట జనాన్ని పలకరిస్తూ హుషారుగా యాత్ర సాగించారు. బస్సుల్లో వెళుతున్న ప్రయాణీకులకు షేక్ హ్యాండ్‌లు ఇస్తూ , పిల్లలను పిలిచి మాట్లాడి ఫొటోలు దిగారు.
రాహుల్‌ను కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు
భారత్ జోడోపాదయాత్ర చేస్తున్నరాహుల్ గాంధీని తెలంగాణ పౌరహక్కుల సంఘ నేతలు సోమవారం కొత్తూరులో కలిసి వినతి పత్రం అందచేశారు. ఉపా చట్టాన్ని, దేశ ద్రోహచట్టాన్ని కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని ఈ రెండుచట్టాలను రద్దుచేసేందుకు తాముచేస్తున్న పోరాటనికి అండగా నిలవాలని కోరారు. రాజ్యంగ హక్కులు కాపాడాలని తెలంగాణ పౌరహక్కులసంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి నారాయణరావు కోరారు.