Hyderabad:హైదరాబాద్‌లో కలుషిత నీటి సరఫరాపై నెటిజన్ల ట్వీట్ల వర్షం
ABN , First Publish Date - 2022-12-15T08:27:14+05:30 IST
హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో కలుషిత నీరు తాగి ఒక మహిళతో సహా ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో నెటిజన్లు జలమండలిపై తీవ్ర ఆగ్రహం...
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో కలుషిత నీరు తాగి ఒక మహిళతో సహా ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో నెటిజన్లు జలమండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.(Tweets) వాటర్ బోర్డు నల్లాల ద్వారా కలుషిత నీటిని సరఫరా చేస్తుండటంతో హైదరాబాద్ నగరంలో (Hyderabad)ఇద్దరు మరణించగా మరో ఐదుగురు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరారు.(Contaminated Tap Water) నల్లాల ద్వారా కలుషితనీరు సరఫరా చేయడం లేదని వాటర్ బోర్డు అధికారులు చెపుతున్నా, ప్రజలు మాత్రం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మైలార్‌దేవ్‌పల్లిలో(Mailardevpally) నల్లాల్లో వచ్చిన కలుషిత మంచినీటిని బాటిల్ లో పట్టి స్థానికులు చూపించారు. దీనిపై కలుషిత నీటి వీడియోను సౌమిత్ యక్కంటి ట్వీట్ చేశారు.(Complaint)
కార్వాన్‌లోనూ డ్రైనేజీ నీరు కలుస్తోంది...
కార్వాన్ ప్రాంతంలోనూ నల్లానీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందని తాను ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వాటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని కేదార్ నాథ్ అనే నెటిజన్ జీహెచ్ఎంసీ, జలమండలి,మంత్రి కేటీఆర్ లకు ఫిర్యాదు చేశారు.కలుషిత నీటి సరఫరా వల్ల ఏమైనా జరిగితే జలమండలే బాధ్యత వహించాల్సి వస్తుందని నెటిజన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్పందించిన జలమండలి కలుషితనీరు వస్తున్న ప్రాంతం ల్యాండ్ మార్క్ కాని ఇంటి నంబరు కాని, ఫోన్ నంబరు కాని ఇవ్వాలని జలమండలి అధికారులు కోరారు.
ఎక్స్ గ్రేషియా ఇవ్వండి
కలుషిత నీరు తాగి ఆసుపత్రుల్లో చేరిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని నెటిజన్లు ట్వీట్ల ద్వారా కోరారు. కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నెటిజన్లు తెలంగాణ సీఎంఓ, కేటీఆర్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ కలుషిత నీరు వస్తుందని పలువురు జలమండలికి ఫిర్యాదులు చేశారు.