Ts News: మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2022-11-14T19:37:24+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్‌లో ఫుడ్‌పాయిజన్ (food poisoning) ఘటన జరిగింది.
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం హైస్కూల్‌లో ఫుడ్‌పాయిజన్ (food poisoning) ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత వచ్చింది. చండ్రుగొండ ప్రభుత్వాస్పత్రికి విద్యార్థులను తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై హుటాహుటిన పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పరిస్థితి గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.