Tarun Chugh: కవిత ఎందుకు అన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలి..
ABN , First Publish Date - 2022-12-21T12:52:11+05:30 IST
BJP Leader Tarun Chugh Press Meet Delhi ఢిల్లీ: మద్యం కుంభకోణం (Liquor Scam)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) పాత్రపై తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ (Tarun Chugh) స్పందించారు.
ఢిల్లీ: మద్యం కుంభకోణం (Liquor Scam)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) పాత్రపై తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ (Tarun Chugh) స్పందించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణం ఛార్జ్ షీట్‌లో మరోసారి కవిత పేరు బయట పడిందన్నారు. తెలంగాణలో మొదలైన వారి దోపిడీ.. ఇప్పుడు దేశ రాజధానికి చేరిందన్నారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయని.. వారందరికీ కఠిన శిక్షలు పడాల్సిందేనన్నారు. సమీర్ మహీంద్రతో కలిసి దోపిడీ చేశారని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ (CM KCR) మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ (TRS Govt.) ముఖ్య పథకాలు కుటుంబ రాజకీయాలు, అహంకారం, అవినీతి పరిపాలన దోచుకున్న డబ్బు బయటపడకుండా ఉండేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చారని విమర్శించారు.
పంజాబ్ సీఎం భగవత్ మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అందరూ లిక్కర్ స్కాంలో ఉన్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. చార్జి షీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని.. అలాగే కవిత ఎందుకు అన్ని ఫోన్లు మార్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మాఫియా తరహాలో ఫోన్లు ధ్వంసం చేశారని, సమీర్ మహేంద్రతో కవితకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్న వారంతా, కవిత ఇంటికి ఎందుకు వచ్చారన్నారు. ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశం ఆంతర్యం ఏమిటన్నారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమేనని, దాని వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ చుగ్ విమర్శించారు.