BJP MLA: మరికొందరు టీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు రావొచ్చు
ABN , First Publish Date - 2022-12-16T14:40:58+05:30 IST
బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: బెంగుళూరు డ్రగ్స్ కేసు (Banglore Drugs Case)తో సంబంధం ఉన్నవారికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (BJP MLA Raghunandan Rao) స్పష్టం చేశారు. శుక్రవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... మరికొందరు టీఆర్ఎస్ నేతల (TRS Leaders)కు ఈడీ (Enforcement Directorate) నోటీసులు రావొచ్చని జోస్యం చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)లకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందన్నారు. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయకుండా.. బెంగుళూరు డ్రగ్స్ కేసులో ఎలా క్లోజ్ అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)లో వంద కోట్లు ఎక్కడున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీలో చేరనందుకే.. కవిత (TRS MLC Kavitha) సీబీఐ విచారణ (CBI) అనటం హాస్యాస్పదమని రఘునందనరావు (BJP MLA) వ్యాఖ్యలు చేశారు.