BJP MLA Raghunandan Rao: దళితుల భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పాలి
ABN , First Publish Date - 2022-12-17T20:13:16+05:30 IST
బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) తెలిపారు.
హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) తెలిపారు. ఎక్కడా బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పలేదని, బండి సంజయ్ అనని మాటలు అన్నట్లు ప్రచారం చేస్తున్నారని రఘునందన్‌రావు విమర్శించారు. 15 రోజుల పాటు ప్రగతిభవన్‌లో నేర్చుకున్న చిలకపలుకులనే రోహిత్‌రెడ్డి పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు కేటాయించిన భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని, మేం లెక్కలు బయటపెట్టాలా? అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. రోహిత్‌తో సింహయాజీ, నందు ఎన్నిరోజులు ఉన్నారో కేసీఆర్ చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.