Suspense: పైలెట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై ఉత్కంఠ
ABN , First Publish Date - 2022-12-20T12:39:53+05:30 IST
మ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి(MLA Pilot Rohit Reddy) ఈడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు తిరిగి హాజరుకావాలని సోమవారమే
హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి(MLA Pilot Rohit Reddy) ఈడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు తిరిగి హాజరుకావాలని సోమవారమే అధికారులు ఆదేశించారు. కానీ ఇంకా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే రోహిత్‌రెడ్డి గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్(Financial District)లో సీఏతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈడీ కార్యాలయాని(ED office)కి బయల్దేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయ్యప్పమాల వేసుకోవడంతో మధ్యాహ్నం పూజ, బిక్ష చేసుకొని బయల్దేరి వెళ్లొచ్చని తెలుస్తోంది.
ఈడీ అధికారులు కోరిన వివరాలను పైలెట్ రోహిత్ రెడ్డి అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన ఆడిటర్ దగ్గర నుంచి పూర్తి పత్రాలు తీసుకుంటున్నారు. తన పేరు మీద, భార్య పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు వాహనాలు, ఇతర స్థిర చరాస్తుల వివరాలను కూడా అందించనున్నారు. భోజన విరామం తర్వాతే ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సోమవారం ఈడీ అధికారులు.. పైలెట్ రోహిత్‌రెడ్డిని ఆరు గంటల పాటు విచారించారు. ఆర్థిక మూలాలు, కేసులపైనే ప్రధానంగా అధికారులు దృష్టిసారించారు. నోటీసులో పేర్కొన్న పత్రాలను మాత్రం ఆయన తీసికెళ్లలేదు. ఈరోజు ఆ పత్రాలను తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు హాజరవుతారా? లేదా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్(Suspense) కొనసాగుతోంది. మరి ఏం జరగబోతుందో వేచి చూడాలి.