Home » ED
తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఐఏఎస్ అమోయ్‌కుమార్‌పై హైదరాబాద్‌లోని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 840 మంది ప్లాట్ ఓనర్లను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమోయ్ కుమార్ అక్రమాలపై ఇప్పటికే కోర్టుల్లో పోరాడుతున్నామని వారు తెలిపారు. అమోయ్ కుమార్‌ను ఈడీ విచారిస్తుంది.
మాజీ కలెక్టర్, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్ కుమార్ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.
దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచారానికి సంజయ్ రాయ్ పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అందుకు సంబంధించిన అభియోగ పత్రాన్ని సోమవారం సల్దాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.