Gaddar: నియంతలకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది
ABN , First Publish Date - 2022-11-26T15:11:00+05:30 IST
నియంతలకు ఏ గతి పట్టిందో కేసీఆర్‌కు అదే గతి పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: నియంతలకు ఏ గతి పట్టిందో కేసీఆర్ (KCR)కు అదే గతి పడుతుందని ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) వ్యాఖ్యలు చేశారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... రాజకీయ నాయకులు ఏకనామికల్ ప్రామిస్ చేస్తారని... కేసీఆర్ (Telangana CM) మాత్రం పొలిటికల్ ప్రామిస్ చేశారని అన్నారు. ప్రజల ఆలోచనలు కేసీఆర్ (TRS Chief) అర్థం చేసుకోవాలని హితవుపలికారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు అనేక పొలిటికల్ ప్రామిసెస్ చేశారని గుర్తుచేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు ఆ మాటపై నిలబడలేదని ప్రశ్నించారు. మూడు ఎకరాల భూమి పక్కన పెట్టి దళితబందు ఎందుకు తెచ్చాడో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్‌ను కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని గద్దర్ పేర్కొన్నారు.