GATE exam centers: తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాల పెంపు

ABN , First Publish Date - 2022-11-26T13:30:44+05:30 IST

తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాల పెంపు

GATE exam centers: తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాల పెంపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో గేట్ పరీక్ష కేంద్రాల (GATE exam centers)ను పెంచుతూ కేంద్రం(Central government) నిర్ణయం తీసుకుంది. గతంలో రాష్ట్రంలో గేట్ పరిక్ష కేంద్రాలను పెంచాలని కేంద్ర ఎమ్‌హెచ్‌ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. కిషన్ రెడ్డి లేఖపై స్పందిస్తూ కొత్తగా నాలుగు పరీక్ష కేంద్రలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్, కొత్తగూడెం, మెదక్, నల్గొండ కొత్త గెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 7 సిటీ సెంటర్స్‌లో గేట్ పరీక్షల నిర్వహణ జరుగుతోంది. కొత్తగా నాలుగు సెంటర్స్ రావడంతో గేట్ పరిక్ష కేంద్రాల సంఖ్య 11కు చేరింది. పరీక్ష కేంద్రాల పెంపుపై ట్విట్టర్ ద్వారా కేంద్రానికి కిషన్ రెడ్డి (Union Minister) కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఇకపై పూర్తి సమయాన్ని పరీక్షలకు సన్నద్ధం అవటంపై కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కిషన్ రెడ్డి కోరారు.

Updated Date - 2022-11-26T13:30:45+05:30 IST