KTR: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అబద్ధం చెప్పడం తెలంగాణను బాధించింది
ABN , First Publish Date - 2022-12-17T18:44:40+05:30 IST
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చామనడం అవాస్తవమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Union Health Minister) అబద్ధం చెప్పడం తెలంగాణను బాధించిందని, భారతదేశంలోని ప్రముఖ లైఫ్-సైన్సెస్ హబ్‌కు బల్క్ డ్రగ్ పార్క్‌ను తిరస్కరించడం ద్వారా దేశానికి గొప్ప అపచారం చేశారని కేటీఆర్ ట్వీట్ ద్వారా విమర్శించారు. కేంద్రం రాజకీయాలు జాతీయ ప్రయోజనాలను మించి ఉండటం విచారకరమని కేటీఆర్ ట్వీట్ చేశారు.