Talasani: ఐటీ, ఈడీ దాడులపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-22T12:59:13+05:30 IST
రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడుల (IT, ED Raids)పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ (BJP) దేశ వ్యాప్తంగా దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. తాటాకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ‘‘అధికారం శాశ్వతం కాదు.. ఇవ్వాళ మీరు ఉన్నారు రేపు మారినప్పుడు ఈ సంప్రదాయం కొనసాగుతుందని మర్చిపోవద్దు’’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Telangana Minister)హెచ్చరించారు.