TS News: నిద్రమత్తులో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం

ABN , First Publish Date - 2022-11-06T11:16:27+05:30 IST

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నిద్రమత్తులో ఉంది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగి..

TS News: నిద్రమత్తులో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నిద్రమత్తులో ఉంది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగి.. ఆదివారం కౌంటింగ్ జరుగుతోంది. ఉప ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాల ఎన్నికల కార్యాలయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాన్ని అప్డేట్ చేయటంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమైంది. ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయినప్పటికీ.. ‌ఇప్పటి వరకూ ఒక్క రౌండ్ ఫలితాన్ని కూడా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అప్డేట్ చేయలేదు.

6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈరోజే ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్, హర్యానా అధంపూర్, తెలంగాణ మునుగోడు, ఉత్తరప్రదేశ్ గోలా గోక్రనాథ్, ఒడిశా ధామ్‌నగర్, బీహార్‌ మొకామాలో, గోపాల్‌గంజ్‌ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంది.

Updated Date - 2022-11-06T11:16:31+05:30 IST