Sharmila: తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సజ్జలకు తగదు
ABN , First Publish Date - 2022-12-08T20:23:58+05:30 IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి అని షర్మిల మండిపడ్డారు. ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని షర్మిల అన్నారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని, విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? అని షర్మిల ప్రశ్నించారు. సజ్జల రెండు రాష్ట్రాలను కలపడంపై ధ్యాస పెట్టడం మానుకుని ఏపీ అభివృద్ధిపై ధ్యాస పెట్టాలని షర్మిల అన్నారు. హక్కుల కోసం పోరాటం చేయాలని, మీ ప్రాంతానికి న్యాయం చేయాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సజ్జలకు తగదని షర్మిల స్పష్టం చేశారు.