TS News: ఎర్రగడ్డలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన తలసాని
ABN , First Publish Date - 2022-11-14T10:19:53+05:30 IST
నగరంలోని ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పర్యటించారు.
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిను మంత్రి (Telangana Minister) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ (Mahamud Ali), మేయర్ విజయలక్ష్మి (Vijayalaxmi) పాల్గొన్నారు. రూ. 5 కోట్లతో జీహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.