Delhi: తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై వీహెచ్ స్పందన..

ABN , First Publish Date - 2022-12-20T12:45:48+05:30 IST

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ (TCongress)లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantharao) స్పందించారు.

Delhi: తెలంగాణ కాంగ్రెస్  పరిణామాలపై వీహెచ్ స్పందన..

ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ (TCongress)లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (V.Hanumantharao) స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్ నేతల (Congress Leaders)కు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను పరిష్కరించమని అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ (Digvijay Singh)ను నియమించిందని, ఇది మంచి పరిణామమని అన్నారు. దిగ్విజయ్ వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలంటూ సమావేశాలు పెట్టే నేతలకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ప్రసుత్తం సమావేశాన్ని విరమించుకోవాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్ కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇన్చార్జిగా చేసిన అనుభవం దిగ్విజయ్ సింగ్‌కు ఉందన్నారు. తాము ఎన్నడూ రేవంత్‌ను వెల్లగోట్టమని అనలేదని, కలుపుకొని పోవాలని చెప్తున్నామని హనుమంతరావు అన్నారు.

Updated Date - 2022-12-20T12:45:51+05:30 IST