Kidnap Case: యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్
ABN , First Publish Date - 2022-12-20T14:59:46+05:30 IST
జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జ్ఞానేశ్వర్ అలియాస్ జానిని షాలిని వివాహం చేసుకుంది. ఇష్టపడే వివాహం చేసుకున్నామన్న యువతి తెలిపింది. ఇంట్లో ఒప్పుకోరు అని కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. అబ్బాయి దళితుడు కాబట్టే తమ ఇంట్లో ఒప్పుకోవడం లేదని షాలిని పేర్కొంది. ఈ మేరకు షాలిని...తాను పెళ్లి చేసుకున్న వీడియోను విడుదల చేసింది.