Home » Rajanna Sircilla
అతనో చేనేత కార్మికుడు.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో మృతిచెందగా.. అద్దె ఇంటికి తీసుకెళ్లే వీలు లేకపోవడంతో మృతదేహాన్ని రాత్రంతా రోడ్డుపై అంబులెన్స్లోనే ఉంచి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తరలించిన హృదయ విదారకర ఘటన చూపరులను కలచి వేసింది.
పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల: కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనుషులు, మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్థులు తెలిపారు.
‘‘రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా? పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వొద్దా? పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు?’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు.
Telangana: తెలంగాణలో పోలీసు భార్యలు ధర్నాకు దిగడం హాట్ టాపిక్ మారింది. తమ భర్తలతో వేరే పనులు చేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మా భర్తలను కుటుంబానికి దూరం చేస్తున్నారంటూ పోలీసు భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారంలో నష్టం, కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు.
సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.