Bandi Sanjay: బీఆర్ఎస్ బ్యానర్పై పోటీకి నేతలు సిద్ధంగా లేరు

ABN , First Publish Date - 2022-12-29T19:03:39+05:30 IST

తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఫైనాన్సర్లు బోర్డు తిప్పేసినట్లు పార్టీ పేరు మార్చారని ఎద్దేవాచేశారు.

Bandi Sanjay: బీఆర్ఎస్ బ్యానర్పై పోటీకి నేతలు సిద్ధంగా లేరు

హైదరాబాద్: తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఫైనాన్సర్లు బోర్డు తిప్పేసినట్లు పార్టీ పేరు మార్చారని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ బ్యానర్పై పోటీకి నేతలు సిద్ధంగా లేరని తెలిపారు. తెలంగాణ (Telangana) కోసమే టీఆర్ఎస్ (TRS)కు ప్రజలు ఓట్లు వేశారని, పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసి.. తెలంగాణ తల్లికి కేసీఆర్ ద్రోహం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఉన్నా.. పక్క రాష్ట్రాలకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుందని బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పోయి.. బీజేపీ వస్తోందని బీజేపీ నేత తరుణ్చుగ్ జోస్యం చెప్పారు. బీజేపీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని తరుణ్చుగ్ హెచ్చరించారు.

Updated Date - 2022-12-29T19:03:54+05:30 IST