MLC Kavitha: రేపు హాజరుకాలేనని సీబీఐకి లేఖ
ABN , First Publish Date - 2022-12-05T19:01:59+05:30 IST
Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రమేయం ఉందంటూ సీబీఐ (CBI) ఇటీవల ఆమెకు నోటీసు ఇచ్చింది. ఈ నెల 6న సీబీఐ ముందు ఆమె హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణ కోసం మరో తేదీని ఫిక్స్ చేయాలని
Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రమేయం ఉందంటూ సీబీఐ (CBI) ఇటీవల ఆమెకు నోటీసు ఇచ్చింది. ఈ నెల 6న సీబీఐ ముందు ఆమె హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణ కోసం మరో తేదీని ఫిక్స్ చేయాలని కవిత సీబీఐకి లేఖ రాశారు. 7వ తేదీన జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్ల కోసం తాను 6వ తేదీ అక్కడికి వెళ్తుండడంతో విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారమిచ్చారు. కవిత రాసిన లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.