Raja Singh: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత? చక్రం తిప్పిన బండి సంజయ్..!

ABN , First Publish Date - 2022-10-29T15:52:11+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Raja Singh: రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత? చక్రం తిప్పిన బండి సంజయ్..!
rajasingh

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను బండి సంజయ్ కోరారు. మునుగోడు పోలింగ్‌కు ముందే సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. రాజాసింగ్‌ ఇచ్చిన వివరణపై బీజేపీ (BJP) హైకమాండ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌కు అన్ని విధాలుగా మద్దతివ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్‌కు సంబంధించిన కేసుల విషయంతో పాటు పార్టీకి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్‌తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. పార్టీ తరపున రాజాసింగ్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao), మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు న్యాయ సహాయం అందిస్తున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే.. మునుగోడులో బలం పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Updated Date - 2022-10-29T15:52:12+05:30 IST