Bharat Jodo Yatra: పారిశుధ్య కార్మికురాలితో రాహుల్ ఆత్మీయ పలకరింపు

ABN , First Publish Date - 2022-10-29T19:41:15+05:30 IST

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో 52వ రోజు అయిన శనివారం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర సందర్భంగా జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు.

Bharat Jodo Yatra: పారిశుధ్య కార్మికురాలితో రాహుల్ ఆత్మీయ పలకరింపు
Rahul Gandhi

మహబూబ్‌నగర్‌: భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో 52వ రోజు అయిన శనివారం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర సందర్భంగా జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. పాదయాత్ర ఆరంభం నుంచి తనని కలిసేందుకు వచ్చినవారితో ముచ్చటిస్తూ వారి సమస్యలు, బాధలు ఆలకిస్తూ, ఓదారుస్తూ ముందుకు సాగారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, పిల్లలు, సంఘాల నాయకులతో మాట్లాడుతూ వారి నుంచి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి వచ్చిన రీసెర్చిస్కాలర్స్‌ అశ్విన్‌, భాస్కర్‌నాయక్‌, హుస్సేన్‌తో చాలా సేపు మాట్లాడారు. యూనివర్సిటీల స్థితిగతులు, ఫ్యాకల్టీ, పరిశోధనల తీరు, యూనివర్సిటీలలో స్థితిగతులు ఎలా ఉన్నాయనే అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు తెలియజేసిన సమస్యలను ఆసక్తిగా విన్నారు. పరిశోధన చేస్తున్న అంశాలను తెలుసుకున్నారు.

పారిశుధ్య కార్మికురాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న రాహుల్‌

రాహుల్‌ను చూసేందుకు రోడ్డు వెంబడి నిలుచున్న పారిశుధ్య కార్మికురాలు నాగమ్‌జూను రాహుల్‌గాంధీ పిలిచి ఆమె భుజంపై చేయివేసి ఆప్యాయంగా మాట్లాడారు. రాహుల్‌గాంధీ స్వయంగా పిలిచి భుజం తట్టి చేతిలో చేయి వేయడంతో ఉబ్బితబ్బిబైన నాగమ్‌జూ ఆయన భుజంపై వాలిపోయారు. ఆమెను ఆప్యాయంగా పలకరించిన రాహుల్‌ పారిశుధ్య కార్మికులందిస్తున్న సేవలు, అందుతున్న వేతనాలు, కుటుంబాల పరిస్థితిని అడిగారు. ఆమె నుంచి వివరాలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా కల్పించారు.

Updated Date - 2022-10-29T19:53:33+05:30 IST