Revanth Reddy: 7న జుక్కల్ నియోజకవర్గం మెనూరులో రాహుల్ భారీ బహిరంగ సభ
ABN , First Publish Date - 2022-11-04T18:16:21+05:30 IST
Telangana News: రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తెలంగాణలో మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు యాత్ర చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Telangana News: రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)తెలంగాణలో మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు యాత్ర చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, ఏఐసీసీ నేత బోసురాజు, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రోహిత్ చౌదరి, ఆర్.దామోదర్ రెడ్డి, ఇతర నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణ సమాజం అండగా నిలబడింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ జోడో యాత్ర తెలంగాణకు వచ్చింది. అయినా యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ నెల 5, 6న మాత్రమే రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. 5వ తేదీ సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. 6వ తేదీ ఎలాంటి కార్నర్ మీటింగ్ ఉండదు. 7న వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదు. ఆ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించాలి.’’ అని రేవంత్ సూచించారు.'