కవితతో సంప్రదింపులా?.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్
ABN , First Publish Date - 2022-11-16T17:41:54+05:30 IST
సీఎం కేసీఆర్ (CM Kcr) పై ఎంపీ అర్వింద్ (MP Aravind) ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవితతో (MLC Kavitha) బీజేపీ (BJP) సంప్రదింపులు జరిపిందన్నకేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM Kcr) పై ఎంపీ అర్వింద్ (MP Aravind) ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవితతో (MLC Kavitha) బీజేపీ (BJP) సంప్రదింపులు జరిపిందన్నకేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (BRS)గా మార్చే సమయంలో కవితను పిలవలేదన్నారు. కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు 20సీట్లకు మించి రావన్నారు. పార్టీలో పాత నేతలను తాను కలుపుకుపోవటం లేదనేది ప్రచారం మాత్రమేనన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్‌ల విషయంలో కొత్త, పాత నేతలను బాలెన్స్ చేశామన్నారు.