ఇంకా లభ్యం కాని గోదావరిలో గల్లంతైన యువకుల ఆచూకీ

ABN , First Publish Date - 2023-04-15T07:23:25+05:30 IST

గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కే గంగవరం మండలం కూళ్ళ వద్ద గోదావరి నది ఒడ్డున పుట్టినరోజు వేడుకల అనంతరం స్నానాలకి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

ఇంకా లభ్యం కాని గోదావరిలో గల్లంతైన యువకుల ఆచూకీ

కోనసీమ : గోదావరిలో గల్లంతైన ముగ్గురు యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కే గంగవరం మండలం కూళ్ళ వద్ద గోదావరి నది ఒడ్డున పుట్టినరోజు వేడుకల అనంతరం స్నానాలకి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యానాం సముద్రం నుంచి నదిలోకి వెనక్కు పోటు ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారింది. రాత్రి సైతం గజ ఈతగాళ్ళు నదిలోకి వెళ్లలేకపోయారు. నిన్న సాయంత్రం నదిలోకి యువకులు స్నానానికి వెళ్ళినప్పుడు మోకాలి లోతులోనే గోదావరి నీరు ఉంది. అయితే ఒక్కసారిగా పోటుతో రావడంతో ఉధృతి పెరిగి సుడిలో చిక్కుకుని యువకులు గల్లంతయ్యారు.

Updated Date - 2023-04-15T07:23:25+05:30 IST