Lokesh Padayatra: యువగళం పాదయాత్రకు విరామం.. బ్రాహ్మణీతో కలిసి హైదరాబాద్‌కు లోకేష్

ABN , First Publish Date - 2023-03-11T17:36:50+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) కోడ్‌ను టీడీపీ గౌరవిస్తోంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) కొనసాగుతోంది.

Lokesh Padayatra: యువగళం పాదయాత్రకు విరామం.. బ్రాహ్మణీతో కలిసి హైదరాబాద్‌కు లోకేష్

చిత్తూరు: ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections) కోడ్‌ను టీడీపీ గౌరవిస్తోంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాటేవారిపల్లి బస కేంద్రం నుంచి టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ యువగళం పాదయాత్రకు తాత్కలికంగా బ్రేక్‌ ఇచ్చారు. ఈ నెల 14 నుంచి మళ్లీ యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కాటేవారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగనుంది. నియోజవర్గ ఓటర్లు మాత్రమే ఇక్కడ ఉండాలని స్థానికేతరులు ఇక్కడ ఉండకూడదని టీడీపీ నేతలకు మదనపల్లె ఆర్డీఓ (RDO) నోటీసులిచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్ కూడా పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చి నోటీసులిచ్చారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో 48 గంటలు ముందే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.

ఎన్నికల సమయంలో ఓటర్లను పార్టీల నేతలు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని, అందువల్ల స్థానికేతరులు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. అందువల్ల ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ తన పాదయాత్రకు రెండు రోజుల ముందే లోకేష్ విరామం ప్రకటించారు. 12, 13 తేదీల్లో తాత్కాలికంగా యువగళం పాదయాత్రకు విరామిచ్చారు. ఈ రోజు పాదయాత్రలో లోకేష్‌ను ఆయన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmani) కలిశారు. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడం ఇద్దరు కలిసి బెంగుళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్తారని టీడీపీ (TDP) నేతలు చెబుతున్నారు. రెండు తర్వాత అంటే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లోకేష్ కాటేవారిపల్లికు చేరుకుని.. అక్కడి నుంచే పాదయాత్రను పున:ప్రారంభిస్తారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

గతంలో కూడా యువగళం పాదయాత్ర మూడు రోజుల విరామం ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకరోజు, నందమూరి తారకరత్న (Taraka Ratna) మృతితో రెండు వరుసగా మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. హైదరాబాదులో తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొని... నేరుగా శ్రీకాళహస్తికి చేరుకుని.. అక్కడి నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ కొనసాగించారు.

Updated Date - 2023-03-11T18:03:17+05:30 IST