Dwaraka Tirumala: కుంచించుకుపోతున్న కాలువగట్టు... దర్జాగా వైసీపీ నేత కబ్జా..!

ABN , First Publish Date - 2023-04-28T21:15:45+05:30 IST

రోజురోజుకు పోలవరం (Polavaram) కుడికాలువ గట్టు కుంచించుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా.. కబ్జాకోరలకు బలైపోయింది.

Dwaraka Tirumala: కుంచించుకుపోతున్న కాలువగట్టు... దర్జాగా వైసీపీ నేత కబ్జా..!

అమరావతి: రోజురోజుకు పోలవరం (Polavaram) కుడికాలువ గట్టు కుంచించుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా.. కబ్జాకోరలకు బలైపోయింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం సమీపంలో పోలవరం కుడి కాలవగట్టు అసలు లేకుండా పోయింది. మొన్నటి వరకు ఎటువంటి పరిమిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా గట్టును తవ్వుకొని అమ్మకాలు చేసుకొని కోట్లు గడించిన వైసీపీ నేతల కన్ను.. ఇప్పుడు ఖాళీ అయినా భూమిపై పడింది. ప్రస్తుతం గట్టు లేని ఖాళీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కూడా తీవ్రంగా యత్నిస్తున్నారు. చివరకు పోలవరం కుడికాలువకు చెందిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని దోబుచర్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత మాండ్రు ప్రసాద్ (YCP leader Mandru Prasad) దర్జాగా ఆక్రమించి ఫెన్సింగ్ కూడా వేసేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు అటువైపు వెళ్ళటం లేదనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణం కబ్జాదారులందరూ అధికార పార్టీ నేతలు కావడమేననే విమర్శలు వస్తున్నాయి.

Untitled-11.jpg

దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఆక్రమించుకున్న భూమికి ఫెన్సింగ్ వేయడంతో వారికి అధికారుల అండదండలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే ప్రభుత్వ భూములను, పోలవరం కుడికాలను సంరక్షించాల్సిన అధికారులే అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొట్లాది రూపాయల విలువైన ప్రభుత్వములను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఇటువంటి కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, త్వరలోనే గ్రామస్తులంతా కలిసి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పోరాటం చేసేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Updated Date - 2023-04-28T23:25:13+05:30 IST