ACB Raids: ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం
ABN , First Publish Date - 2023-11-24T13:09:24+05:30 IST
Andhrapradesh: ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది.
అమరావతి: ఏపీ సచివాలయంలో (AP Secretariat) ఏసీబీ దాడుల (ACB Raids) కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ.40,000 లంచం తీసుకుంటుండగా నాగభూషన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విదేశీ విద్యోన్నత నిధులు మంజూరుకు సంబంధించిన ఫైలు విషయంలో లంచం తీసుకుంటూ నాగభూషన్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు.