Chandrababu: చంద్రబాబు పీటీ వారెంట్‌పై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
ABN , First Publish Date - 2023-11-29T18:55:55+05:30 IST
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5వ విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5వ విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి (డిసెంబర్ 1) వాయిదా వేసింది.
చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ఐఆర్‌ఆర్ మాస్టర్ ప్లాన్‍లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ (CID) కేసు నమోదు చేసిన విషయం తెలిసందే.