Chandrababu news: చంద్రబాబు పిటిషన్‌ల విషయంలో ఇరువురు న్యాయవాదులపై జడ్జి అసహనం.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-27T18:14:15+05:30 IST

ఏసీబీ కోర్ట్ నుంచి కోర్టు హాలు నుంచి ఇరు వర్గాల న్యాయవాదులు బయటకి వెళ్లిపోయారు. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్లీ వెనక్కి వచ్చారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని న్యాయమూర్తిని సుధాకర్ రెడ్డి కోరారు. అయితే ఇందుకు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Chandrababu news: చంద్రబాబు పిటిషన్‌ల విషయంలో ఇరువురు న్యాయవాదులపై జడ్జి అసహనం.. కారణం ఏంటంటే..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, రిమాండ్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 4కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించిన తర్వాత ఏసీబీ కోర్ట్ హాలు నుంచి కోర్టు నుంచి ఇరు వర్గాల న్యాయవాదులు బయటకి వెళ్లిపోయారు. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్లీ వెనక్కి వెళ్లారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని న్యాయమూర్తిని సుధాకర్ రెడ్డి కోరారు. అయితే ఇందుకు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.


తరచూ ఇరువురు న్యాయవాదులు విచారణను ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఇక వాదనలు వినేది లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కస్టడీ, బెయిల్ పిటీషన్‌ల విషయంలో ఇరువురు న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కోర్టు ఎలా ముందుకు సాగుతుందని ఆయన ప్రశ్నించారు. అక్టోబర్ 4వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అదే రోజు కస్టడీ, బెయిల్‌పై వాదనలు వినిపించాలని చెప్పారు. ఆ రోజు వాదనలు చెప్పకుంటే ఆర్డర్ పాస్ చేస్తానని న్యాయమూర్తి వివరించారు.

Updated Date - 2023-09-27T18:14:15+05:30 IST