AP NEWS: పోలీసుల కళ్లు కప్పి పారిపోయిన నిందితులు

ABN , First Publish Date - 2023-05-09T20:15:31+05:30 IST

కనిగిరి కోర్టు (Kanigiri Court) దగ్గర ఇద్దరు నిందితులు పరారయ్యారు.

AP NEWS: పోలీసుల కళ్లు కప్పి పారిపోయిన నిందితులు

ప్రకాశం: కనిగిరి కోర్టు (Kanigiri Court) దగ్గర ఇద్దరు నిందితులు పరారయ్యారు. పోలీసుల (police) అదుపులో ఉన్న నిందితులు వారి కళ్లుకప్పి తప్పించుకుని పరారయ్యారు. స్థానికుల సాయంతో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ కేసులో నిందితులను పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు.

ఇటీవల రంప మన్యం మీదుగా యథేచ్ఛగా సాగుతున్న గంజాయి రవాణాకు సహకరిస్తూ నెలనెలా లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతూ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చుతున్న పరిణామాలు ప్రహసనంగా సాగుతున్నాయి. గంజాయి లోడు ఆయా పోలీసుస్టేషన్ల పరిధి దాటాలంటే లోడును బట్టి రేటును నిర్ణయించి గేట్లు ఎత్తేస్తున్న అధికారులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజ్యమేలుతున్నారు. మావోయిస్టు విప్లవాల నుంచి మన్యంవాసులను దూరం చేసే దిశగా గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా పోలీసు ఇమేజ్‌ను పెంచే ప్రయత్నాలను గొప్పగా చెప్పుకుంటున్న పోలీసు వ్యవస్థలో మాయని మచ్చగా కొందరు పోలీసు అధికారులు మారుతున్నారు. మోతుగూడెం ఎస్‌ఐ ఒకరు ఆయన స్టేషన్‌ మీదుగా వెళుతున్న గంజాయి కారును వదిలేయగా, అది నెల్లూరులో ఎస్‌ఈబీ అధికారులకు చిక్కి మొత్తం బాగోతం బయటపడింది. సదరు ఎస్‌ఐకు ఎంత ముట్టచెప్పామో కూడా గంజాయి స్మగ్లర్లు నెల్లూరు పోలీసులకు తేటతెల్లం చేయడంతో అల్లూరిజిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా తీవ్రంగా స్పందించారు. ఆయనకు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన మోతుగూడెం పోలీసుస్టేషన్లోనే ఆ స్టేషన్‌ ఎస్‌ఐతోపాటు ఆయనకు సహాయకులుగా ఉన్న ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లపైనా కేసు నమోదు చేయించారు.

Updated Date - 2023-05-09T20:15:31+05:30 IST