కుమార్తెకు జాబిల్లిపై ఎకరా భూమి గిఫ్ట్‌..!

ABN , First Publish Date - 2023-09-18T02:23:31+05:30 IST

చిన్నప్పుడు చంటి బిడ్డలు అన్నం తినకుంటే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తారు. కానీ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వ్యక్తి తన కూమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపైఎకరా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారు.

కుమార్తెకు జాబిల్లిపై ఎకరా భూమి గిఫ్ట్‌..!

మదనపల్లె యువకుడి వినూత్న ఆలోచన

లూనార్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థ నుంచి కొనుగోలు

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 17: చిన్నప్పుడు చంటి బిడ్డలు అన్నం తినకుంటే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తారు. కానీ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వ్యక్తి తన కూమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపైఎకరా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారు. చంద్రుడిపై భూమి విక్రయిస్తారా.. అది కూడా రిజిస్ట్రేషన్‌ చేయిస్తారా..? అంటే ఆయన అవుననే అంటున్నారు. మదనపల్లె పట్టణం ప్రశాంతనగర్‌కు చెందిన షేక్‌ ఆసిఫ్‌ బెంగళూరులోని ప్రైవేటు బ్యాంకులో క్లస్టర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.


గతేడాది నవంబరులో ఆయనకు కుమార్తె పుట్టగా మైషా అని పేరుపెట్టారు. మైషాకు పుట్టినరోజు కానుకగా చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలనుకున్నారు. అమెరికాకు చెందిన లూనార్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థ చంద్రుడిపై భూమిని విక్రయిస్తోందని తెలిసి వారిని సంప్రదించారు. చంద్రునిపై ఒక ఎకరా భూమి కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ సంస్థ బే ఆఫ్‌ రెయిన్‌బో్‌స ప్రాంతంలో భూమి విక్రయిస్తున్నట్లు ఆసి్‌ఫకు మెయిల్‌ పంపింది. ఎకరా ధర రూ.1700తో పాటు రిజిస్ట్రేషన్‌, ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌, కొరియర్‌ చార్జీలు కలిపి మొత్తం రూ.11,600 వసూలు చేసింది. దీన్ని ఈ ఏడాది ఆగస్టు 28న రిజిస్టర్‌ చేస్తే ఆదివారం ఆసి్‌ఫకు డాక్యుమెంట్లు వచ్చాయి. చంద్రుడిపై ఉత్తరాన సైనస్‌ ఇరిడియం కాలనీలో బే ఆఫ్‌ రెయిన్‌బో ప్రాంతంలో హద్దులు నిర్ణయించి ఇచ్చారు. ప్రస్తుతం ఎక్స్‌టెండెండ్‌ ట్రేడర్స్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) కింద ఈ భూమిని పెడతారు. భవిష్యత్‌లో దీని ధరలు పెరిగితే ఈటీఎ్‌ఫలో ఈ భూమి విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది.

Updated Date - 2023-09-18T09:35:56+05:30 IST