LokeshYuvaGalam: నల్లబ్యాడ్జీతో పాదయాత్ర చేస్తున్న లోకేష్.. కారణమిదే...
ABN , First Publish Date - 2023-03-21T11:41:01+05:30 IST
టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 49వ రోజు ప్రారంభమైంది.
శ్రీసత్యసాయిజిల్లా: టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) 49వ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమానికి లోకేష్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల (Anganwadis) పై జగన్ సర్కారు (jagan Government) దాష్టీకానికి నిరసనగా నల్లబ్యాడ్జీ ధరించి నిరసన చేపట్టారు. లోకేష్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలియజేశారు. నల్లబ్యాడ్జీతో యువగళం పాదయాత్ర కొనసాగించారు. జీతాల పెంపుపై హామీలు అమలు చేయాలని కోరితే అరెస్టు చేయడం దారుణమన్నారు. హక్కుల కోసం గళమెత్తి అంగన్వాడీలపై పోలీసులతో అణచివేత అప్రజాస్వామికమని మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయబద్దమైన హామీలు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.
కాగా.. 49వ రోజు పాదయాత్ర కదిరి ఆర్డీఓ కార్యాలయం సమీపాన విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముత్యాలమ్మ చెరువులో టిడ్కో గృహాల పరిశీలన, లబ్ధిదారులతో భేటీకానున్నారు. ఆపై ఆలీపూర్ తండా వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. ముత్యాలమ్మ చెరువు వద్ద స్థానికులతో మాటామంతీలో లోకేష్ పాల్గొంటారు. ముత్యాలమ్మ చెరువు వద్ద భోజన విరామం అనంతరం... ముత్యాలమ్మ చెరువు వద్ద నుంచి పాదయాత్ర కొనసాగనుంది.
సాయంత్రం :
పుట్టపర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం
పులగంపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ
మిట్టపల్లి వద్ద దివ్యాంగులతో భేటీ.
గొనుకువారిపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.