Anantapuram Dist.: కలుషిత నీరు కలకలం.. ఒకరి మృతి...
ABN , First Publish Date - 2023-05-11T14:59:06+05:30 IST
అనంతపురం జిల్లా: గుమ్మఘట్ట మండలం, బేలేడు గ్రామంలో కలుషిత నీరు (Polluted Water) కలకలం రేగింది. కలుషిత నీరు తాగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా..
అనంతపురం జిల్లా: గుమ్మఘట్ట మండలం, బేలేడు గ్రామంలో కలుషిత నీరు (Polluted Water) కలకలం రేగింది. కలుషిత నీరు తాగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ (Water Tank)ను అధికారులు శుభ్రం చేయలేదు. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమైంది. ఆ నీటిని తాగిన గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
రోజురోజుకు బాధితుల సంఖ్య పెరిగుతోంది. వారికి చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరియమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.